Sunday, February 23, 2025
HomeTrending Newsవరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటన

వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటన

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మలక్ పేట, భూపాలపల్లి నియోజకవర్గం చెన్నాపూర్ లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శింఛి ధైర్యం చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు పసునూరి దయాకర్, కవిత; ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి కెసియార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అయితే రాత్రి పొద్దుపోయిన తరువాత సిఎం పర్యటన ఆకస్మికంగా రద్దయింది. దీనితో మంత్రులు పర్యటనకు వెళ్ళారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్