Saturday, January 18, 2025
Homeసినిమాఉత్కంఠను రేపుతున్న 'మీర్జాపూర్ 3'

ఉత్కంఠను రేపుతున్న ‘మీర్జాపూర్ 3’

అమెజాన్ ప్రైమ్ ను ఫాలో అయ్యేవారి సంఖ్యను అమాంతంగా పెంచేసిన వెబ్ సిరీస్ గా ‘మీర్జాపూర్’ కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని ‘మీర్జాపూర్’ నేపథ్యంలో ఈ కథ అంతా నడుస్తుంది. గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్ లో డైలాగ్స్ .. హింస .. శృంగార సంబంధమైన సన్నివేశాల పట్ల మొదట్లో అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. మున్నాభయ్యా – గుడ్డూ భయ్యా పేర్లు చాలా పాప్యులర్ అయ్యాయి. ఒకరకంగా ఆ పాత్రలు ఈ సిరీస్ ను నిలబెట్టాయి.

సీజన్ 1కి విశేషమైన ఆదరణ లభించడంతో, సెకండ్ సీజన్ ను రంగంలోకి దింపారు. కొత్త పాత్రలను యాడ్ చేస్తూ వదిలిన సీజన్ 2కి కూడా విశేషమైన ఆదరణ లభిచింది. నిజానికి సీజన్ 1 కంటే హింస మరింత పెరిగిపోయిందనే టాక్ కూడా వచ్చింది. అయినా ఈ సిరీస్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

మూడో సీజన్ ను జూలై 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. రీసెంటుగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. హింసతో పాటు మిగతా అంశాల విషయంలో కంటెంట్ ఎంతమంత్రం తగ్గలేదనే విషయం అర్థమవుతుంది. మున్నా భయ్యా పాత్రను సెకండ్ సీజన్ లోనే ముగించడం వలన, ఈ సీజన్ చప్పగా ఉంటుందేమోనని అనుకున్న అభిమానులను ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. జూలై 5వ తేదీ కోసమే అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొదటి రెండు సీజన్లను మూడో సీజన్ మించిపోతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్