Saturday, January 18, 2025
HomeసినిమాMiss Shetty Mr Polishetty: పెద్ద బ్యానర్ చేసిన చిన్న ప్రయోగం .. 'మిస్ శెట్టి...

Miss Shetty Mr Polishetty: పెద్ద బ్యానర్ చేసిన చిన్న ప్రయోగం .. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి!

Mini Review: అనుష్క శెట్టి – నవీన్ పోలిశెట్టి కలిసి ఒక సినిమా చేయనున్నరనే టాక్ బయటికి వచ్చినప్పుడు ఎవరూ కూడా పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య క్రేజ్ పరంగా .. మార్కెట్ పరంగా చాలా తేడా ఉంది. పైగా ఇది ఎవరూ ఆశించని కాంబినేషన్ .. ఊహించని కాంబినేషన్ కూడా. అయితే యూవీ బ్యానర్ వారు మాత్రం ఈ ఇద్దరితో కలిసి ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అలా సెట్స్ పైకి వెళ్లిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, నిన్ననే థియేటర్లకు వచ్చింది. మహేశ్ బాబు పి. ఈ సినిమాకి దర్శకుడు.

ఈ సినిమాలో అనుష్క – నవీన్ మధ్య రొమాన్స్ ఉండకపోవచ్చు అని ఫ్యాన్స్ ఒక అంచనాకు వచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత వాళ్లకి ఒక క్లారిటీ వచ్చింది. కథలో అన్విత ( అనుష్క)కి పెళ్లి .. రిలేషన్ షిప్స్ పై నమ్మకం ఉండదు. వైవాహిక జీవితంలో తన తల్లిపడిన కష్టాల కారణంగా తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ తనకి ఒక తోడు కావాలి గనుక, సిద్ధూ (నవీన్ పోలిశెట్టి) ద్వారా ఒక బిడ్డను కనాలనుకుంటుంది. స్పెర్మ్ డొనేట్ చేసే దిశగా అతణ్ణి ఆమె ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈ లోగానే మనవాడు తనని ఆమె లవ్ చేస్తుందని అనుకుంటాడు.

తన పట్ల అన్విత చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి కారణం, తనని ప్రేమిస్తూ ఉండటమేనని భావించిన సిద్ధూ,  ఆమెను ఒక రేంజ్ లో ఆరాధించడం మొదలుపెడతాడు. ప్రేమ అనే కాన్సెప్ట్ కి దూరంగా అన్విత .. ఆమె ప్రేమకోసం పరితపించే సిద్ధూ .. ఈ ఇద్దరి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. చెప్పుకోవడానికి గొప్ప కథ కాదు .. ఇంతకుముందు ఎవరికీ తెలియని కొత్త కంటెంటూ కాదు. కాస్త ఎమోషన్ .. మరికాస్త కామెడీ కలిపి వడ్డించిన విస్తరి ఇది. సింపుల్ లైన్ అయినప్పటికీ, సాధ్యమైనంత వరకూ సందడి చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ పరంగా .. కాస్టింగ్ పరంగా ఎలా చూసినా, పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన ఒక చిన్నపాటి ప్రయోగంగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్