Wednesday, April 17, 2024
HomeTrending Newsవిశ్వసుందరిగా హర్నాజ్ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్ సంధు

Miss Universe Harnaaz Sandhu

భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. 2021 ఏడాదికిగానూ మిస్ యూనివర్స్​గా నిలిచింది. ఇజ్రాయెల్ లోని ఏయ్లాట్  వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెడుతూ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. మొదటి రన్నరప్ గా పరాగ్వే దేశానికి చెందిన నాడియా ఫెరీరా దక్కించుకోగా సెకండ్ రన్నరప్ గా దక్షిణాఫ్రికాకు చెందిన లలేల స్వానె నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది.

హర్నాజ్ సంధు.. 2000 మార్చి 3న చండీగఢ్​​లో జన్మించింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాస్టర్స్​ చదువుకుంటోంది. ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 21ఏళ్ల అమ్మడు.17ఏళ్ల వయసులో మోడలింగ్​ ప్రారంభించిన హర్నాజ్​ ఇప్పటివరకు 2017లో టైమ్స్​ ఫ్రెష్​ ఫేస్​ మిస్​ చండీగఢ్​, 2018లో మిస్​ మ్యాక్స్​ ఎమర్జింగ్​ స్టార్​, 2019లో ఫెమినా మిస్​ ఇండియా పంజాబ్​, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని అందుకుంది. స్వతహాగా నటి అయిన ఈమె.. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్