Sunday, January 19, 2025
HomeTrending Newsపిల్ల చేష్టలు మానుకో: లోకేష్ పై పిన్నెల్లి ఫైర్

పిల్ల చేష్టలు మానుకో: లోకేష్ పై పిన్నెల్లి ఫైర్

No Faction: పచ్చని పల్నాడులో లోకేష్ చిచ్చు రాజేస్తున్నారని,  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.  తమ బయోడేటా లోనే భయం లేదని లోకేష్ చెబుతున్నారని, అసలు తండ్రీకొడుకులిద్దరికీ  అసలు బయోడేటా ఉందా అని నిలదీశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, ఆయనట్రస్ట్ ను, అకౌంట్లను దొంగిలించిన దొంగలు అంటూ  నిప్పులు చెరిగారు. లోకేష్ కు ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ఆధార్ కార్డు కూడా లేదని ఎద్దేవా చూశారు.  తాడేపల్లిలోని  వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి నిన్న పల్నాడులో పర్యటన సందర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

తండ్రీ కొడుకులిద్దరూ రాయలసీమలో పుట్టినా ఇద్దరూ గ్రామ సింహాలే అంటూ పిన్నెల్లి విమర్శించారు.  నిన్నటి దాకా విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చి హడావుడిగా టూర్ పెట్టుకొని ఏవేవో మాట్లాడారని,  తాను నాలుగుసార్లు మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.  లోకేష్ ఇలాగే మాట్లాడితే ఈసారి 23 కాదు కదా 3 సీట్లు కూడా రావని, పిల్ల చేష్టలు ఏవైనా ఉంటే ఉంట్లో కొడుకు దేవాన్ష్ దగ్గర చేసుకోవాలని సూచించారు.

తాను 13 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా  ఉన్నానని, గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని, టిడిపికి కొత్త ఇన్ ఛార్జ్ ని నియమించిన తరువాతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పిన్నెల్లి ఆరోపించారు. పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిచాలని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింహం లాంటి జగన్ ను చూసి వాతలు పెట్టుకోవద్దని లోకేష్ కు హితవు పలికారు.

Also Read : పల్నాడు గొడవలకు బాబే కారణం: పిన్నెల్లి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్