సైబరాబాద్ పోలీసుల పిటిషన్‌పై వాదనలు‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో నిందితులకు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏసిబి కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్‌కు అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సైబరాబాద్ సీపీ ఎదుట నిందితులు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు మేజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు వెంటనే హాజరు కావాలని ఆదేశం. ఏసీబీ కోర్టు రేమండ్ రిజెక్ట్ ను కొట్టివేసిన హైకోర్టు.
Also Read : డబ్బుల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు బండి సంజయ్