Sunday, January 19, 2025
HomeTrending Newsసుప్రీంకు చేరిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

సుప్రీంకు చేరిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించటంతో  తెలంగాణ హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం… పిటీషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే.

సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని దుష్యంత్ దవే ఆందోళన వెలిబుచ్చారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేను కోరిన సిజెఐ. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సిజెఐ చంద్రచూడ్ వెల్లడించారు. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపిన సిజెఐ చంద్రచూడ్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్