Mlc Jeevan Reddy Is Angry With Bjp And Trs Parties :
రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యం కొనుగోలు చేయాలని,వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి మద్దతు ధర కల్పించాలని రాష్ట్రంలో కాదు డిల్లిలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా చేయాలని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య మంత్రి కెసిఆర్ ను డిమాండు చేశారు.
శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయం ఉమ్మడి జాబితాలో చేర్చారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాల్సిన భాధ్యత ఉందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం తోస్తూ మద్దతు ధర కల్పించక తోడు దొంగల్లా వ్యవహరిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ వ్యవహారాలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. నిన్నటివరకు చివరి గింజ వరకు కొంటామని చెప్పిన కెసిఆర్ నేడు కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సరికాదన్నారు.
వరి వేస్తే ఉరి అని చెప్పి రైతులను ఆరుతడీ పంటలు వేయాలనడం సమంజసం కాదని, నేల స్వభావాన్ని బట్టి పంటలు వేస్తారన్నారు. ఆరుతడీ పంటలకు కోతులు అవరోధంగా మారాయని, కోతుల పునరుత్పత్తి నిలువరింప చేయాలని లేకుంటే పంటల పరిస్థితి ఆగమ్య గోచరంగ ఉంటుందన్నారు.
మొదట వర్షా కాలం పంటను మద్దతుదరకు కొనుగొలు చేసి యాసంగి పంటగురించి ఆలొచించాలని, కొనుగోలు కెంధ్రాల్లొ ప్రభుత్వం తెలిపిన నిభంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల పక్షపాతిగా ఉండాల్సింది పోయి మిల్లర్లకు ఏజెంటుగా పనిచేస్తుందని జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తారని భావించి బిజెపి,టీఆర్ఎస్ ప్రభుత్వాలు ముందె ఒకరిపై ఒకరు విమర్శించుకుంటు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వరిని కొనుగొలు చేయడం చేతకాక,మద్దతు ధర కల్పించడం వీలుకాకపోతే రాష్ట్రంలో క్రాఫ్ హాలిడే ప్రకటించి ఎకరానికి 20 వేలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్న,ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లిడర్ కల్లేపెల్లి ధుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, మాజీ వైస్ చైర్మన్ మన్సురి అలీ,ఎంపిటిసి సుధాకర్,కాంగ్రెస్ నాయకులు బండ శంకర్,గాజుల రాజేందర్,గాజంగి నందయ్య,జున్ను రాజేందర్,ధర రమేశ్ బాబు,పుప్పాల అశోక్,చందా రాధాకిషన్, విజయ్,నెహాల్,మహిపాల్,మొగిలి,గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా…?
రాష్ట్రంలో ఎన్నికల నియామావలి అమలులో ఉన్న నేపథ్యంలో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ రహదారిని నిర్బంధించి టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం, దీనికి కలేక్టర్ అనుమతిచ్చారా అని ప్రజల్లో అనుమానాలున్నాయని ఈ విషయమై కలేక్టర్ అభిప్రాయం వెల్లడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కొసం రాత్రి వేళలో పోలీసులు దగ్గరుండి టెంట్లు వేయించడమేమిటని, టీఆర్ఎస్ పార్టి ధర్నాకు పోలీసులు రక్షణ కల్పించడం చూస్తుంటే జిల్లాలో శాంతి భద్రతలు ఏమయ్యాయని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల నియామావలికి అనుగుణంగానే కలేక్టర్, అధికారులు నడుచుకొవాలని అలా కాకుండా జాతీయ రహదారి నిర్బంధించి ధర్నా చెయడాన్నీ చూస్తుంటే జగిత్యాల జిల్లాకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని అనుమానం కలుగుతుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెల్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: వరి వేదన