Sunday, January 19, 2025
HomeTrending Newsఎన్టీఆర్ లాగే కేసీఆర్ కు భంగపాటు - జీవన్ రెడ్డి

ఎన్టీఆర్ లాగే కేసీఆర్ కు భంగపాటు – జీవన్ రెడ్డి

బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం… నాడు ఎన్ టీ ఆర్ లాగే నేడు కేసీఆర్ రాజకీయాల్లో కనుమరుగవడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాల ఇందిరా భవన్ లో గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండగా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఆ హక్కులను కాపాడడంలో వైపల్యం చెందిన కేసీఆర్ కు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజల ఆధరణ కోల్పోయి 1994 లో ఎన్టీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నించి రాజకీయాల్లో ఏమయ్యాడో అదే తరహాలో ఎనిమీదేల్లా పాలనలో కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల హక్కులను కాపాడడంలో విఫలమై బిఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ పార్టీ పెట్టి ఎన్టీఆర్ లాగే కేసీఆర్ కు జరుగుతుందని జోస్యం చెప్పారు.
విజయదశమి రోజున టిఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బిఆర్ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీ పెట్టడంతో తెలంగాణ ప్రజలకు పట్టిన శని విరగడయిందని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నా పని అయిపోయిందని కేసీఆర్ దేశoమీద పడ్డారని, టిఆర్ఎస్ రద్దుతో తెలంగాణ గురించి ఉచ్చరించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని తేల్చి చెప్పారు.భవిష్యత్తు అంతా తెలంగాణకు మంచే జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి మైత్రి కోసం రాయలసీమ ప్రాజెక్ట్ నీటి దోపిడీకి కేసీఆర్ అనుమతించారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు నెపంతో తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏకపక్షంగా ఎపిలో విలీనం చేసి అక్కడి ప్రాంతవాసులను ఇబ్బందులకు గురిచేశాడని, సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపేశాడని, నీటిపంపకాల్లో మన వాటాను తీసుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని విమర్శించారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ చేపడితే కేవలం 18 వందల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని ఇక్కడి నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ప్రాజెక్ట్ నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమే లేకుండేదని దీంతో లక్ష కోట్ల మిగిలేవని అన్నారు.
హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు తెలంగాణలో అంతర్భాగమని దీక్ష చేశానని చెప్పుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు గడుస్తున్నా ఫ్రీజోన్ గానే అమలవుతుందని దీంతో తెలంగాణ వాసులకు ఉద్యోగాలు 25 శాతం మాత్రమే లభిస్తున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణలో ప్రైవేట్ యునివర్సిటీలను అనుమతించి ముఖ్యమంత్రి కేసిఆర్ హైదబాద్ ను ఫ్రీ జోన్ గా మార్చాడని దాంతో తెలంగానేతరులే 75 శాతం ఉద్యోగాలు పొందుతున్నారని చెబుతూ హైదరాబాద్ ఫ్రీ జోన్ ఆంద్రోల్ల పేత్తనానికి అంటగట్టాడని జీవన్ రెడ్డి ఆరోపించారు.
మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్లెపెల్లి దుర్గయ్య, దేవెందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధు, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్,నాయకులు అల్లాల రమేష్ రావు, లైశెట్టి విజయ్, చాంద్ పాషా, మహిపాల్, ఇబ్రహీం,బాస మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పార్టీ నేతలకే బీఆర్ఎస్ అర్థం కాలేదు – బండి ఎద్దేవా

RELATED ARTICLES

Most Popular

న్యూస్