Sunday, June 14, 2026
Homeస్పోర్ట్స్Well Done: నిఖత్ కు కవిత సన్మానం

Well Done: నిఖత్ కు కవిత సన్మానం

తెలంగాణ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. ఇటీవలే ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్  50 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ ను కవిత అభినందించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కూడా నిఖత్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణా క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

నిఖత్ నిజామాబాద్ జిల్లా కు చెందినవారు కాగా, కవిత కూడా అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular