Sunday, November 24, 2024
HomeTrending NewsDelhi Liquor Scam: కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా

Delhi Liquor Scam: కవిత పిటిషన్ మూడు వారాలకు వాయిదా

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనకు సమన్లు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీంకోర్టు ట్యాగ్‌ చేసింది. కవిత తన పిటిషన్‌లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. విజయ్ మండల్‌ జడ్జిమెంట్‌ పీఎంఎల్‌ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని.. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ. జస్టిస్‌ అజయ్ రస్తోగి, జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Also Read : Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్