Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్సీ అర్జునుడు మృతి

ఎమ్మెల్సీ అర్జునుడు మృతి

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వల్లభనేని వంశీ వైఎస్సార్సీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బచ్చుల అర్జునుడిని గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా చంద్రబాబు నాయుడు నియమించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన అర్జునుడు మొదటినుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2000-05 వరకూ మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈనెల 29తో ముగుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్