Saturday, January 18, 2025
Homeజాతీయంసెప్టెంబర్ నాటికి 30 కోట్ల డోసుల కార్బివ్యాక్స్

సెప్టెంబర్ నాటికి 30 కోట్ల డోసుల కార్బివ్యాక్స్

బయోలాజికల్ ఇవాన్స్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బివ్యాక్స్’ కేంద్ర ప్రభుత్వం ౩౦ కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. సెప్టెంబర్ నాటికి ఈ డోసులు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వి కే పాల్ వెల్లడించారు. కార్బివ్యాక్స్ ఒక డోస్ రేటు ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదని, ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీకి కేంద్రం సహకారం అందించిందని, రేటు విషయంలో కేంద్ర- బి ఈ కంపెనీలు పరస్పరం చర్చినుకుని ఓ నిర్ణయానికి వస్తామని, ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని పాల్ స్పష్టం చేశారు.

కోవిడ్ పై కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్బివ్యాక్స్ తో పాటు 25 కోట్ల కోవిషీల్డ్, 19 కోట్ల కోవాక్సిన్ డోసులు కొనుగోలు చేస్తామని పాల్ వివరించారు.

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని నిన్న మోడీ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్ లను అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కోవి షీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-వి, తాజాగా కార్బివ్యాక్స్ తో పాటుగా విదేశాల నుంచి కూడా మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ వ్యాక్సిన్ లను కూడా దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్