Saturday, January 18, 2025
HomeTrending Newsజగన్ పై మోడీకి తండ్రి ప్రేమ: నిర్మలా

జగన్ పై మోడీకి తండ్రి ప్రేమ: నిర్మలా

Affection: ప్రధాని మోడీ, ఏపీ సిఎం జగన్ పట్ల ఎంతో ఆప్యాయతగా ఉంటారని, తండ్రి ప్రేమను కనబరుస్తారని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాల సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతపురము జిల్లలో  నాసిన్ అకాడమీ ఏర్పాటు ఇందుకు దీనికి ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.

గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నిర్మాణంకానున్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) కు కేంద్రమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా వారిని ప్రధాని కలుస్తారని, ఒక తండ్రి లాంటి అపెక్షన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రధాని పలకరిస్తారన్నారు.

అంతకుముందు కేంద్ర మంత్రి నాసిన్ అకాడమీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎన్.వై.కే. వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, సిబిఐసి చైర్మన్ వివేక్ జోహ్రీ, సిబిఐసి మెంబర్ సుంగిత శర్మ, నాసిన్ డిజి ఎస్ఆర్. బరూహ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్