ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ఢిల్లీలోని పార్లమెంటు పాత భవనంలో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్టీలకు చెందిన ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మోడీని ఎన్డీయేపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ ఎంతో కష్టపడ్డారని, ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ఓ భారీ ర్యాలీలో పాల్గొన్నారని గుర్తు చేశుకున్నారు.
మోదీ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని ప్రశంసించారు. ‘ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, మోడీ వంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్, సమర్థత, సేవలు దేశానికి ఎంతో అవసరం.. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికాడు.. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలి.. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ పేరును సగర్వంగా బలపరుస్తున్నాను’ అంటూ బాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.