Saturday, November 23, 2024
HomeTrending Newsఢిల్లీ విద్యా విధానం భేష్ - సిఎం కెసిఆర్

ఢిల్లీ విద్యా విధానం భేష్ – సిఎం కెసిఆర్

ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం  సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అరవింద్ కేజ్రీవాల్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ తిలకించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ, పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్. స్కూల్ సందర్శన తర్వాత మహమ్మద్‌పూర్‌లోని మోహల్లా క్లినిక్‌ను కేసీఆర్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోందని కెసిఆర్ ప్రశంసించారు.

భారత్ లో మరెక్కడా ఇటువంటి విద్యా విధానం లేదని, డిల్లీలో పిల్లలను చదివించటంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని కెసిఆర్ అభినందించారు. ఢిల్లీ ప్రజలు అదృష్టవంతులని, ఢిల్లీ లాంటి విధానాలపై చర్చించాలన్నారు. కేంద్రం ఏ కొత్త పాలసీ అయినా చేయొచ్చని, కేంద్రం, అన్ని రాష్ట్రాలతో చర్చించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్