Saturday, January 18, 2025
Homeసినిమాసితార బ్యానర్లో మోక్షజ్ఞ ఎంట్రీ?

సితార బ్యానర్లో మోక్షజ్ఞ ఎంట్రీ?

నందమూరి అభిమానులంతా చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్నారు. అడపా దడపా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ ప్రస్తావించడం మినహా, ఆ దిశగా మోక్షజ్ఞ ప్రయత్నిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని కొందరు, లేదు .. అతనికి యాక్టింగ్ పట్ల ఇష్టం లేదని మరికొందరు. ఇలా ఊహాగానాలు మాత్రమే షికారు చేస్తున్నాయి తప్ప, ఎక్కడా ఎలాంటి బలమైన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ మరోసారి హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రస్తావించారు. నిన్న రాత్రి జరిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన, మోక్షజ్ఞ గురించి మాట్లాడారు. మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి రావాలనీ, ఇప్పుడు టాలీవుడ్ లో సందడి చేస్తున్న అడివి శేష్ .. సిద్ధూ జొన్నలగడ్డ .. విష్వక్ వంటి యూత్ ను స్ఫూర్తిగా తీసుకోమని తాను చెబుతూ ఉంటానని అన్నారు. సితార వంశీని ప్రశంసించారు. త్వరలో తమకి సంబంధించిన ఒక ప్రకటన ఉంటుందని అన్నారు.

దాంతో సితార బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా ఉండొచ్చనీ, ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చనే ప్రచారం మొదలైంది. ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞను చూస్తే .. గతంలో కంటే ఇప్పుడు ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టిని పెట్టినట్టుగా కనిపించాడు. మరి సినిమాల్లోకి రావాలనే ఆలోచనతోనా లేదా అనేది తెలియదు. ఒకవేళ మోక్షజ్ఞ హీరోగా రంగంలోకి దిగితే, ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్