Sunday, February 23, 2025
HomeTrending Newsమహారాష్ట్రలో మనీ లాండరింగ్ రాజకీయం

మహారాష్ట్రలో మనీ లాండరింగ్ రాజకీయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మనీ లాండరింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో సంబందాలు ఉన్నవారిని విచారిస్తున్న ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ తాజాగా ఎన్సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను ఈ రోజు విచారిస్తోంది. ఈ రోజు ఉదయం మంత్రిని  నివాసం నుంచి ఈడి కార్యాలయానికి తీసుకెళ్ళిన విచారణ బృందం అండర్ వరల్డ్ తో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది.

మంత్రి నవాబ్ మాలిక్ కు నోటీసులు ఇవ్వకుండానే విచారణ పేరుతో ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ అధికారులు తీసుకెళ్లటం దురదృష్టకరమని ఎన్సిపి నాయకురాలు, ఎంపి సుప్రియ సులే అన్నారు. మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడి అరెస్టు చేయటం, అందుకు అధికారులు అనుసరించిన విధానం మహారాష్ట్ర ప్రతిష్టను దిగాజార్చేదిగా ఉందని ఎంపి సుప్రియ సులే ధ్వజమెత్తారు. మహారాష్ట్రను అవమానించే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్తరకం రాజకీయాలకు తెరలేపుతోందని సుప్రియ సులే ఆరోపించారు. మంత్రి నవాబ్ మాలిక్ కు ఈడి నోటీసులు వస్తాయని బిజెపి నేతలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, మహా వికాస్ అఘడికి ముప్పు తప్పదని ప్రచారం చేశారు. ఈ రోజు జరిగింది చూస్తే ఈడి బిజెపి నేతల కనుసన్నల్లో నడుస్తోందని రుజువైందని సుప్రియ అన్నారు.

మనీ లాండరింగ్ కేసులో ఈడి కొద్ది రోజులుగా ముంబై లో వివిధ సంస్థలు, వ్యక్తుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తూ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. దావూద్ అనుచరులుగా అనుమానిస్తున్న వ్యక్తుల ఇల్లు, కార్యాలయాలు టార్గెట్ గా ఈడి దాడులు నిర్వహించింది.

Also Read : దావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఈడి తనిఖీలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్