Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్ లో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం : మేయర్

హైదరాబాద్ లో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం : మేయర్

హైదరాబాద్ నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి.. నగరంలో మౌలిక వసతులు కల్పన ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. నగరంలో ముఖ్యమైన రద్దీ ప్రదేశంలో ప్రజలకు అనుగుణంగా మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


నగర ప్రజలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి,38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు. అందులో 8 బ్రిడ్జిలు కంప్లీట్ అయ్యాయన్నారు. అదే విధంగా నగరా ప్రజలకు జనాభాకు అనుగుణంగా నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు హోంమంత్రి మహమూద్ ఆలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్