Sunday, January 19, 2025
HomeTrending Newsఇండోర్, సిలిగురిల్లో విష జ్వరాలు  

ఇండోర్, సిలిగురిల్లో విష జ్వరాలు  

డెంగ్యు జ్వరాలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగర ఆస్పత్రులు నిండిపోయాయి. ఒక్కరోజే 22 కేసులు రావటంతో ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు కేవలం ఇండోర్ నగరంలోనే 225 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 మంది వరకు చిన్నారులే ఉన్నారు.  పది రోజుల్లోనే డెంగ్యు వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. రెట్టింపు స్థాయిలో డెంగ్యు జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం కేసులు తక్కువగా చూపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డెంగ్యు తో ఎంతమంది చనిపోతున్నారో సరైన లెక్కలు వెల్లడించటం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.

అటు పశ్చిమబెంగాల్ సిలిగురి నగరంలో చిన్న పిల్లలు అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు. జల్పాయ్ గురి జిల్లాలో మూడు రోజుల్లోనే రెండు వందల మంది చిన్నారులు జ్వరాలతో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త వైరస్ మొదలైందని ఉత్తర బెంగాల్ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చిన్న పిల్లలు ఏ మాత్రం సుస్తీగా ఉన్నా తల్లిదండ్రులు ఆస్పత్రులకు తీసుకురావటంతో మాల్దా నుంచి కుచ్ బీహార్ వరకు ప్రబుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు జనసంద్రంగా మారాయి. ప్రభుత్వం అత్యవసరంగా ఇతర ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని జల్పాయ్ గురి, డార్జిలింగ్, మాల్దా జిల్లాలకు తరలించింది.

పరిస్థితి సమీక్షించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హుటాహుటిన వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి బృందాన్ని ఉత్తరబెంగాల్ పంపింది. పెద్దలకు రాకుండా కేవలం చిన్న పిల్లలకే జ్వరం సోకటం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. చిన్నారుల జ్వరాలకు కారణాలు పరిశీలించిన వైద్య బృందం సాధారణ వైరల్ జ్వరాలేనని ప్రకటించింది. దోమ కాటు వల్లే ఈ జ్వరాలు వస్తున్నాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్