Sunday, January 19, 2025
Homeసినిమాచిరు కోసం స్టోరీలు రెడీ చేస్తున్న దర్శకులు ఎవరు..?

చిరు కోసం స్టోరీలు రెడీ చేస్తున్న దర్శకులు ఎవరు..?

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ‘వాల్తేరు వీరయ్య’ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించింది. 250 కోట్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు. దీంతో చిరంజీవి నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఇతనే అంటూ పలువురు దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి.

ఇంతకీ చిరంజీవితో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్న దర్శకులు ఎవరంటే.. పూరి జగన్నాథ్ కు చిరంజీవితో సినిమా చేయాలనేది డ్రీమ్. ‘ఆటో జానీ’ అనే సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు. ఇప్పుడు పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడని.. స్టోరీ లైన్ వినిపించాడని.. చిరు ఫుల్ స్టోరీ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అలాగే చిరంజీవి హరీష్ శంకర్, మారుతితో కూడా సినిమా చేయాలి అనుకున్నారు. ఓ వేడుకలో స్వయంగా చిరంజీవే చెప్పారు. ఈ విషయం తెలిసి హరీష్ శంకర్, మారుతి చిరంజీవి కోసం కథలు రెడీ చేస్తున్నారు.

ఇక రవితేజతో ‘ధమాకా’ సినిమా చేసి ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన నక్కిన త్రినాథరావుతో కూడా సినిమా చేయడానికి చిరంజీవి ఉత్సాహాన్ని చూపించారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా చిరంజీవి కోసం ఒక కథను రెడీ చేస్తున్నాడని తెలిసింది. మరి.. వీళ్లలో ఎవరి సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: చిరంజీవితో శ్రీకాంత్ అడ్డాల సినిమా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్