Sunday, September 8, 2024
HomeTrending Newsరైతులతో ప్రభుత్వాల చెలగాటం

రైతులతో ప్రభుత్వాల చెలగాటం

 Election Promises :  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం టిపిసిసి ప్రచార కమిటి చైర్మెన్,మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వపరంగా నడిపించి చెరుకు రైతులను అన్నివిధాల ఆధుకుంటానని చెప్పి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ ఫ్యాక్టరీనే మూయించి రైతులకు తీరని అన్యాయం చేశారని కవిత తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంటను రైతులు అధికంగా పండిస్తారని నాకు ఓట్లు వేసి గెలిపిస్తే పసుపు బోర్డ్ తీసుకువచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి దాన్ని ఎంపీ అరవింద్ అటకెక్కించారని దుయ్యబట్టారు. ఇరువురు నిజామాబాద్ ఎంపీలు రైతుల విషయంలో మోసం చేశారని ఎంపీగా మధుయాష్కీ బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చాడని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు, మిర్చి వాణిజ్య పంటలకు ప్రోత్సాహకాలు కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నస్టపొయారని కెంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యామ్నాయoగా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ వాటికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని, జగిత్యాల ప్రాంతంలో చెరుకు పంట అనుకూలంగా ఉంటుందని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విపలమయ్యయని ఆరోపించారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించడంకొసం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం,దేవేందర్ రెడ్డి, బండ శంకర్ , ధుర్గయ్య,మన్సుర్ ఆలీ, రామచంద్రా రెడ్డి, చిట్ల అంజన్న , జున్ను రాజేందర్, గుండా మధు, రఘువీర్ గౌడ్, తోట నరేశ్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆరూ కారుకే- ఖమ్మంలో తగ్గిన మెజార్టీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్