Saturday, January 18, 2025
HomeTrending Newsఎంఎస్ స్వరాన వినాలనుకున్న గాంధీజీ

ఎంఎస్ స్వరాన వినాలనుకున్న గాంధీజీ

మద్రాసు ప్రెసిడెన్సీలో శాసనసభలో ఆవిష్కరించిన తొలి చిత్రపటం జాతిపిత గాంధీజీదే.

అప్పటి దేశప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ 1948 జూలై 24వ తేదీన మహాత్ముని చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

నాటి కార్యక్రమంలో అలనాటి భారతదేశ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి ( రాజాజీ), మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఓమందూర్ రిమసామి రెడ్డియార్ తదితరులు పాల్గొన్నారు.

సంగీత విద్వాంసురాలు సుబ్బులక్ష్మి గాంధీజీని ప్రశంసిస్తూ “వాయ్ గ నీ ఏమ్మాన్”
అనే గీతాన్ని ఆలపించారు. అనంతరం గాంధీజీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

ఈ గీతార్థం…

మా నాయకుడా!
నువ్వు వర్థిల్లాలి!
ఈ ప్రపంచంలోని దేశాలలో
అట్టడుగున
దారిద్ర్యంతో
స్వేచ్ఛను కోల్పోయి
బానిసై ఉన్న దుస్థితిలో
స్వేచ్ఛావాయువులు శ్వాసించేలా
చేసి
దేశం యావత్తూ తలెత్తుకునేలా
నిలిచేలా చేసిన గాంధీ మహాత్మా
నువ్వు వర్థిల్లాలి! వర్థిల్లాలి!!

1941 ప్రాంతంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మితో పరిచయమయ్యాక గాంధీజీ అప్పుడప్పుడూ ఆమెతో తనకిష్టమైన పాటలు పాటించుకున్న సందర్భాలున్నాయి.

ఓమారు చెన్నైకి వచ్చినప్పుడు గాంధీజీ తనకిష్టమైన కృష్ణుడు మీద భక్త మీరాబాయ్ భజన్ ని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొంతులో వినాలనుకున్నారు. అప్పటికప్పుడు పాడమని కోరారు.

అయితే ఎం.ఎస్. కు “నాకా పాట ఎలా పాడాలో తెలీదు. పైగా అంతకుమునుపు పాడిన పాటకూడా కాదు” అని మెల్లగా అంటుంటే గాంధీజీ సరే వద్దులే అని అనలేదు.

“అలాగైతే పరవాలేదు. నువ్వు పాడక్కర్లేదు. నీ కంఠాన పాట రూపంలో కాకపోయినా కనీసం పాటలోని మాటలను పలికిస్తే వినాలని ఉంది” అని గాంధీజీ వెళ్ళిపోయారు.

ఆప్పుడు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆ పాటను నేర్చుకుని పాటలోని ప్రతి మాటకూ అర్థం తెలుసుకుని మరుసటిరోజు పాడి దాని రికార్డుని గాంధీజీకి పుట్టినరోజు కానుకగా ఎయిర్ మెయిల్ Air Mailలో పంపారు.


ఆ పాట గాంధీజీ మరణానంతరం అనేకసార్లు ఆలిండియా రేడియోలో ప్రసారం చేశారు. ఆ పాట ….

హరీ తుమ్ హరో జన్ కీ భీర్
ద్రౌపది కీ లాజ్ రాఖీ
తుమ్ బడాయో చీర్

బక్త్ కారణ్ రూప్ నరహరీ
ధరియో ఆప్ శరీర్
హరిణ కశ్యప్ మార్ లీన్హూ
థరియో నాహీ ధీర్

బూడతే గజ్ రాజ్ రాఖ్యో
కియో బాహర్ నీర్
దాస మీరా లాల్ గిరిధర్
దుఃఖ జహాఁ తహా భీర్

ఈ పాటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 1947లో హిందీలో విడుదలైన మీరా చిత్రంలో పాడగా ఎస్.వి.వెంకటరామన్ సంగీతం సమకూర్చారు. ఎంఎస్ మీరాబాయి పాత్రలో నటించారు.

– యామిజాల జగదీశ్

Also Read : ఆ గ్రామాన్ని దారిలోకి తెచ్చిన చదరంగం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్