Monday, January 20, 2025
Homeసినిమాఇక 'శాకుంతలం'పైనే అందరి దృష్టి! 

ఇక ‘శాకుంతలం’పైనే అందరి దృష్టి! 

ఈ ఏడాది ఆరంభంలోనే తెలుగు ఇండస్ట్రీకి రెండు భారీ విజయాలు లభించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ థియేటర్లకు వస్తే, ఆ మరుసటి రోజునే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాల కథా నేపథ్యం వేరైనప్పటికీ, మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్నవే కావడం విశేషం. ఈ కారణంగానే రెండు సినిమాలు వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.

ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించినప్పటికీ, అందరి దృష్టి మాత్రం ‘శాకుంతలం’ పైనే ఉంది. కథాకథనాలు .. విజువల్ ఎఫక్ట్స్  పరంగా ఈ సినిమా పాన్ ఇండియా కంటెంట్ ను కలిగి ఉంది. గుణశేఖర్ కి ఉన్న ఇమేజ్ .. సమంతకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఇప్పటికే బయటికి వచ్చిన అప్ డేట్స్ వలన, ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా మార్చడానికి గుణశేఖర్ ప్రయత్నించాడనే విషయం అర్థమైపోతోంది.

మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం, ఇంతవరకూ బయటికి వచ్చిన సాంగ్స్ ను బట్టి తెలిసిపోతూనే ఉంది.  శకుంతలగా సమంత నటించగా .. దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలను మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి పోషించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చేనెల 17వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్