Sunday, January 19, 2025
HomeTrending Newsఆఫ్ఘన్ అధినేతగా హసన్ అఖుంద్

ఆఫ్ఘన్ అధినేతగా హసన్ అఖుంద్

అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్  ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు.

1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక డిప్యూటీలుగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్, ముల్లా అబ్దుల్ సలామ్ పేర్లు ఖరారయ్యాయి. మరోవైపు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ కుమారుడు ముల్లా యాఖూబ్‌కు రక్షణ శాఖ అప్పగించనున్నారు. హోంశాఖ మంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీని నియమించనున్నారు. ఇక విదేశాంగ మంత్రిగా అమీర్ ఖాన్ ముత్తకీని నియమించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్