Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్చెన్నైను ఓడించిన ముంబై

చెన్నైను ఓడించిన ముంబై

At last Mumbai:  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మరో ఊరట దక్కింది. అవలీలగా గెలవాల్సిన మ్యాచ్ ను చెమటోడ్చి,  ఉత్కంఠతతో గెలవాల్సివచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ముంబై బౌలర్లు అధ్బుతంగా రాణించి చెన్నైను 97 పరుగులకే కట్టడి చేశారు. అయితే లక్ష్య సాధనలో ముంబై కూడా 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో తిలక్ వర్మ – హృతిక్ షోకీన్ లు నిలకడగా రాణించి విజయానికి బాటలు వేశారు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ముంబై బౌలర్ డేనియల్ శామ్స్ వేసిన మొదటి ఓవర్లోనే చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టులో  ముగ్గురు (దేవాన్ కాన్వే, మొయిన్ అలీ, మహీష తీక్షణ) డకౌట్ కాగా….. మరో నలుగురు (రుతురాజ్ గైక్వాడ్-7; రాబిన్ ఊతప్ప-1; సిమర్జీత్ సింగ్-2; ముఖేష్ చౌదరి-4) సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బ్రావో-12; అంబటి రాయుడు, శివమ్ దూబే చెరో 10 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ ఒక్కడే 33 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చెన్నై  16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది, ముంబై బౌలర్లలో డానియెల్ శామ్స్ మూడు; మెరెడిత్, కుమార్ కార్తికేయ చెరో రెండు;  బుమ్రా, రమణ్ దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్య సాధనాలు ముంబై అష్టకష్టాలు పడింది. 6 పరుగుల వద్ద ఓపెనర్ ఇషాన్ కిషన్(6) ఔటయ్యాడు.  రోహిత్ శర్మ-18 పరుగులు చేయగా డానియేల్ శామ్స్-1; ట్రిస్టాన్ స్టబ్స్- డకౌట్… త్వరగా ఔటయ్యారు. తిలక్- షోకీన్ ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించారు, షోకీన్ 18 స్కోరు చేసి వెనుదిరిగాడు. తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34; టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 2  సిక్సర్లతో 16 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలిపించారు. 14.5 ఓవర్లలో లక్ష్యం ఛేదించింది.

చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు; సిమర్జీత్ సింగ్, మొయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.

డానియేల్ శామ్స్ కు ‘ మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : రాణించిన మార్ష్, వార్నర్: ఢిల్లీ గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్