Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ముంబైకు ఐదో ఓటమి-పంజాబ్ విజయం

ఐపీఎల్: ముంబైకు ఐదో ఓటమి-పంజాబ్ విజయం

Punjab ‘King’s: ఐపీఎల్ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా చవిచూడని ముంబై నేడు జరిగిన ఐదో మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. పంజాబ్ 12 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. పంజాబ్ ఓపెనర్లు  కెప్టెన్ మయాంక్ అగర్వార్, శిఖర్ ధావన్… చివర్లో జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్ లు ధాటిగా ఆడారు.  లక్ష్య ఛేదనలో ముంబై ఆటగాళ్ళు బ్రేవిస్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్….. చివర్లో ఉనాద్కత్ లు మెరుపులు మెరిపించి ఓ దశలో విజయంపై ఆశలు రేకెత్తించినా చివరకు పంజాబ్ దే పైచేయి అయ్యింది.

పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తొలి బంతి నుంచే పరుగుల వేట మొదలు పెట్టింది, మయాంక్ ఫోర్ తో స్కోరు బోణీ చేశాడు. ధావన్ తో కలిసి తొలి వికెట్ కు 93 పరుగులు జోడించాడు, మయాంక్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బెయిర్ స్టో-12; లివింగ్ స్టోన్-2 పరుగులకే పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ ధావన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి థంపి బౌలింగ్ లో పోలార్డ్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. తర్వాత జితేష్ 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 30; షారుఖ్  6 బంతుల్లో 2సిక్సర్లతో 15పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో థంపి రెండు; బుమ్రా, మురుగన్ అశ్విన్, ఉనాద్కత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ముంబై 31 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది, మంచి జోరుమీదున్న కెప్టెన్ రోహిత్ శర్మ(28)ను రబడ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో ముంబై బ్యాట్స్ మెన్ డేవిడ్ బ్రేవీస్- తిలక్ వర్మ లు పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం దద్దరిల్లింది. బ్రేవిస్ 25 బంతుల్లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ కూడా 20 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 30 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో యాదవ్ ఔట్ కావడంతో పంజాబ్ ఊపిరిపీల్చుకుంది. 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ నాలుగు; రబడ రెండు; వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు.

మయాంక్ అగర్వాల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read: ఐపీఎల్: ‘శివ’మెత్తిన దూబే, ఊతప్ప: చెన్నై గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్