మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి ఓటర్లను కొనుగోలు చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయల్ని తన కంపెనీ నుంచి ఎవరెవరి ఎకౌంట్లకు ఎంతెంత ట్రాన్స్ ఫర్ చేశారో ఆధారాలతో సహా బయటపెట్టింది..ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఓట్లను కొనుగోలు చేయడానికి రాజ్ గోపాల్ రెడ్డి సొంత కంపెనీల నుంచి 23 బ్యాంకు ఎకౌంట్లకు ఎంతెంత ట్రాన్స్ ఫర్ చేశారో అందులో వివరించారు. ఆ 23 అకౌంట్లు పూర్తిగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు టీఆర్ఎస్ వెల్లడించింది.
ఐదు కోట్ల 22 లక్షల రూపాయల్లో సుషీ ఇన్ఫ్రా నుంచి ఈ నెల 18వ తేదీన కోటిన్నర రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు.
పబ్బు అరుణ ఎకౌంట్ లోకి యాభై లక్షలు
పబ్బు రాజు గౌడ్ ఎకౌంట్ లోకి యాభై లక్షలు
పబ్బు రాజు గౌడ్ కే చెందిన మరో ఎకౌంట్ కు 50 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు..
ఇదే నెల 14వ తేదీన సుషీ ఇన్ ఫ్రా నుంచి రెండు కోట్లు వివిధ ఖాతాల్లోకి వెళ్లాయి..
కాసర్ల విష్ణు వర్థన్ రెడ్డి కి 16 aలక్షలు
కే.విజయవర్థన్ రెడ్డికి 16 లక్షలు
కేఎస్ఆర్ ట్రేడింట్ అండ్ కోకి 16 లక్షలు
ఏ.నవ్యశ్రీ, కె.వెంకటరమణ, దిండు భాస్కర్, పోలోజు రాజ్ కుమార్,
దిండు యాదయ్య, శ్రీనివాస టెంట్ హౌజ్, డి.దయాకర్ రెడ్డి, తిరుమల మిల్క్ ప్రాడక్ట్స్, శివ కుమార్ బుర్రా, ఉబ్బు సాయి కిరణ్, మణికంఠ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, టంగుటూరి లిఖిత ఎకౌంట్లకు ఒక్కొక్క ఎకౌంట్ కు 16 లక్షల చొప్పున ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. అదే రోజు చింతల మేఘనాథ్ రెడ్డి అనే మరో వ్యక్తి ఎకౌంట్ కు 40 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి
వీళ్లంతా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు..వీరికి సుషీ ఇన్ ఫ్రా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కోసం ఇంత డబ్బును వారి ఎకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. వెంటనే ఆ అకౌంట్ల ను సీజ్ చేయాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కల కమిషన్ ను కోరింది. తక్షణం రాజ్ గోపాల్ రెడ్డి పై చర్య తీసుకోవాలని కోరింది.
ఆ డబ్బును విత్ డ్రా చేసి ఓట్ల కోసం ప్రజలకు పంచకముందే వాటిని సీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీఆర్ఎస్ పార్టీ..ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును పొందిన సుషీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిడెట్ కంపెనీ ఆ డబ్బును ఇలా ప్రజాస్వామ్యాన్నిపాతరేస్తూ ఓట్ల కోనుగోలు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని..దయచేసి చర్య తీసుకోవాల్సిందిగా పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ ఈసీకి లేఖ రాశారు.