Wednesday, September 25, 2024
HomeTrending Newsదేనికోసం కెసిఆర్ మునుగోడు సభ - కిషన్ రెడ్డి

దేనికోసం కెసిఆర్ మునుగోడు సభ – కిషన్ రెడ్డి

బిజెపిలో చేరే నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని అనుకుంటే వారు ఆ పార్టీ కి , చట్ట సభల ప్రతినిధి అయితే దానికి రాజీనామ చేసి పార్టీ లోకి రావాల్సిందనని పేర్కొన్నారు. మునుగోడులో రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఎమ్మేల్యే పదవికి రాజీనామ చేసి బిజెపిలో చేరాలని రాజ్ గోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారని, మునుగోడు ప్రజల సమక్షంలో, మునుగోడు గడ్డ మీదనే జాయిన్ అవుతాను చెప్పారని వెల్లడించారు. దీంతో హోమ్ శాఖ మంత్రి ఇక్కడికి వస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

ఇతర పార్టీ ల నుండి గెలిచి దొడ్డిదారిన TRS పార్టీ లోచేరి మంత్రి పదవుల్లో ఉన్నారని, అలాంటి ప్రజాస్వామ్య విరుద్ద సంప్రదాయాల్ని బిజెపి ప్రోత్సహించదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. TRS పార్టీ గందరగోళ పరిస్థితిలో పాలన కొనసాగిస్తుందని, పూర్తిగా భయంతో, అభద్రత భావంతో ఆ పార్టీ ఉందన్నారు. మునుగోడుకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదని, అసలు కెసిఆర్ ఈ రోజు ఇక్కడ సభ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఈ రోజు సభ అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. కెసిఆర్ రేపు మరో సభ పెట్టుకున్న భయపడేది లేదని తెగేసి చెప్పారు. కెసిఆర్ రేపటి నుండి మునుగోడులో కుర్చీ వేసుకుని కుర్చున్న అభ్యంతరం లేదన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఎలా పంచుకుందో… మునుగోడును కూడా అలా పంచుకున్న మాకు అభ్యంతరం లేదని వ్యంగ్యంగా కిషన్ రెడ్డి విమర్శించారు.

Also Read : కొందరి స్వార్థంతో మునుగోడు ఎన్నికలు మంత్రి తలసాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్