Saturday, January 18, 2025
HomeTrending Newsరాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి - ఉత్తమ్ డిమాండ్

రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి – ఉత్తమ్ డిమాండ్

రాజకీయ లబ్ది కోసం రాజాసింగ్ ని బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజాసింగ్ ని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ పై పాస్ట్ ట్రక్ కోర్టు పెట్టి విచారించాలన్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు గాంధి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ విషయం లో ప్రభుత్వం ని 6750 కోట్లు 30 రోజుల్లో కట్టాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉండగా ఈ టైంలొనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం బీజేపీ టీఆరెస్ కలిసి ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కాళేశ్వరం లో అవినీతి జరిగిందని మోడీ,అమిత్షా, నడ్డా మాట్లాడతారని, కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ ఎందుకు జరపరని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ,కాళేశ్వరం మీద సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే మీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రజలు భావిస్తారని హెచ్చరించారు.

రాష్ట్ర విభజనలో తెలంగాణకి రావాల్సిన ఏ ఒక్క హామీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏమైందని, ఆంధ్ర లో పూర్తయింది.. తెలంగాణ లో 8 సంవత్సరాలకి కోటి రూపాయలు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. ఐటీఐఆర్ ని యుపిఏ ప్రభుత్వం మంజూరు చేయగా…దాని ద్వారా తెలంగాణకు రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది..50 లక్షల ఉద్యోగాలు వచ్చేవని గుర్తు చేశారు. తెలంగాణకు మేలు చేసే ఆ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసిందని విమర్శించారు.

మునుగోడు అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసిసి కి పంపామని, ఏఐసిసి  త్వరగా నిర్ణయాన్ని ప్రకటించి అభ్యర్థిని ప్రకటిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మునుగోడులో అందరం కలిసి సమన్వయంతో పని చేస్తామన్నారు. 2011 ప్రకారం తెలంగాణలో 9 శాతం గిరిజనులు ఉన్నారు..రిజర్వేషన్లు పెంచాలని పార్లమెంట్ లో చాలాసార్లు ప్రతిపాదించామని, మునుగోడు లో ఓటు అడిగే ముందు గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: నా మీద కుట్ర జరుగుతోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్