Sunday, January 19, 2025
HomeTrending Newsవచ్చే ఎన్నికల్లో పోటీ: మురళీధర్ రావు

వచ్చే ఎన్నికల్లో పోటీ: మురళీధర్ రావు

Election Politics: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి. మురళీధర్ రావు వెల్లడించారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అవినీతి అంశంలో కెసియార్ ను జైలుకు పంపడం ఖాయమని, అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు.

తెలంగాణాలో బిజెపికి అనుకూల వాతావరణం ఉందని, కాంగ్రెస్ అసలు పోటీలోనే ఉండదని అయన అభిప్రాయ పడ్డారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితిలోనే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పంచాయతీలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమాయ పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలున్నారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్