Bhootam: టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకుల పై ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుదేవా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ‘ మై డియర్ భూతం ‘ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు ప్రభుదేవా రెడీ అయ్యారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం రైటర్ నందు తుర్లపాటి మాట్లాడుతూ .. ‘రమేష్ అన్న, బాలాజీ అన్న, మా మాస్టార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక వేళ మీరు ఈ సినిమాను చూడకపోతే ఓ నోస్టాల్జిక్ మూమెంట్‌ను మిస్ అవుతారు. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని అన్నారు.
పాటల రచయిత చల్లా భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు పాటలు రాసే టైంలో నేను యశోద డైలాగ్స్ రాయడంలో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నందు అన్న ఫోన్ చేసి ‘మై డియర్ భూతం’ గురించి చెప్పారు. ఎప్పుడూ ఇలానే అంటావ్.. బ్రేక్ వచ్చేది చెప్పమని అన్నాను. దీంతో బ్రేక్ వస్తుందని ఆయన అన్నారు. ప్రభుదేవా గారికి పాట రాయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇమ్మాన్ గారి పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మాస్టార్ గారు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటున్నారు. అందరినీ థియేటర్లోకి ఆహ్వానించే సినిమా అవుతుంది అన్నారు.
ప్రభుదేవా మాట్లాడుతూ.. ‘భాగ్యలక్ష్మీ గారు పాటలు బాగా రాశారు. ఇది నాకు హోం గ్రౌండ్. నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు.