నా అంచనాలు విఫలం : ప్రభాస్

Prabhas on marriage:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ భారీ పీరియాడిక్ మూవీ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ముంబాయిలో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం.. ఈ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం.. తెలిసిందే. అయితే.. ఈ ట్రైల‌ర్ ఈవెంట్ లో ప్ర‌భాస్ పెళ్లి గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

దీనికి ప్ర‌భాస్ చెప్పిన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… ఈ మూవీ ట్రైలర్ లో పూజా హేగ్డే ప్రేమ విషయంలో ఆదిత్య అంచనా తప్పు అనే డైలాగ్ ని తీసుకొని ఒక రిపోర్టర్ .. నిజ జీవితంలో అలా జ‌రిగిందా..?  ఇంత‌కీ.. మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో మీరు ఉహించారా..? అని అడిగింది. ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్..  ప్రేమ విషయంలో నా అంచనాలు.. జీవితంలో ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చాయి.. అందుకే నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. ప్ర‌భాస్ న‌వ్వుతూనే చెప్పిన‌ప్ప‌టికీ… నిజంగానే ల‌వ్ లో ఫెయిల్ అయ్యాడని..  అందుకే పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లి గురించి ప్ర‌భాస్ చెప్పిన ఈ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి: ప్రేమ‌కు.. విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ‘రాధేశ్యామ్’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *