Saturday, February 22, 2025
HomeTrending Newsపవన్ కు నా సపోర్ట్ ఉంటుంది: చిరంజీవి

పవన్ కు నా సపోర్ట్ ఉంటుంది: చిరంజీవి

పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీకి మద్ధతుకు సంబంధించి గతంలో తాను ఎలాంటి  స్పష్టమైన ప్రకటనా చేయలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.  “వాడు నా తమ్ముడు,   తన నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటినుంచీ తెలుసు నాకు, దాన్నుంచి ఎక్కడా పొల్యూట్ అవ్వలేదు, అంతటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలి, వారు ఏ పక్షాన ఉంటారు, ఎలా ఉంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు.  బట్ అలాంటి వారు రావాలని నా ఆకాంక్ష. దానికి డెఫినెట్  గా నా సపోర్ట్ ఉంటుంది”  అంటూ చిరంజీవి  ప్రకటించారు. తామిద్దరం  చెరో పక్క ఉండకూడదనే.. తానే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను బయటకు వచ్చానని వెల్లడించారు.

“ఫ్యూచర్ లో గొప్ప నాయకుడవుతాడు,  ఏమో ఏలే అవకాశం ప్రజలు అతనికి ఇస్తారేమో అని భావిస్తున్నా, అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను”  అన్నారు. కాగా… చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’  రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్