Tuesday, October 1, 2024
Homeసినిమావీరయ్య, వీర శివారెడ్డి ల ప్రీ రిలీజ్ ఎప్పుడు?

వీరయ్య, వీర శివారెడ్డి ల ప్రీ రిలీజ్ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్,  కేథరిన్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ మాస్ యాక్షన్ గా  ఇది రూపొందుతోంది.  ఫ్రాన్స్ లో చిరంజీవి, శృతి హాసన్ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు, దీనితో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

సంక్రాంతికి కానుకగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. జనవరి 8న విశాఖ నగరంలో ఈవెంట్ ను  భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైజాగ్ బ్యాక్ డ్రాప్లో సాగే స్టోరీ కాబట్టి అక్కడే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇది చిరంజీవి ఆలోచన అని.. వైజాగ్ ఈవెంట్ కోసం స్పెషల్ గా ట్రైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుంది. ఇందులో కూడా కథానాయిక శృతిహాసనే కావడం విశేషం. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న వీరసింహారెడ్డి షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా వస్తుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి అటు వీరయ్య.. ఇటు బాలయ్య.. ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు. మరి.. సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్