Sunday, January 19, 2025
Homeసినిమానభా నటేశ్ ఏమైపోయిందబ్బా?!

నభా నటేశ్ ఏమైపోయిందబ్బా?!

Nabha- Kya Hua: తెలుగు తెరపై సందడి చేసిన భారీ అందాల భామల జాబితాలో నభా నటేశ్ ఒకరుగా కనిపిస్తుంది. కన్నడ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ, ఆ తరువాత ‘నన్నుదోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.  సుధీర్ బాబు జోడీగా నభా చేసిన ఈ సినిమా ఆమెకి సక్సెస్ తో పాటు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. అందాలు ఆరబోయడంలో ఎంతమాత్రం మొహమాటం లేని ఈ సుందరి, ‘ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో చెలరేగిపోయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక నభా జోరు షురూ అయినట్టేనని అంతా అనుకున్నారు.

అనుకున్నట్టుగానే నభాకి వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. సీనియర్ స్టార్ హీరో అయిన రవితేజ మొదలు .. బెల్లంకొండ శ్రీనివాస్ వరకూ ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే రవితేజ సరసన చేసిన ‘డిస్కోరాజా’ ఆశించినస్థాయిని  అందుకోలేకపోయింది. సాయితేజ్ జోడీగా చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా ప్రేక్షకులను నిరాశే పరిచింది. ఆ తరువాత వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా మాత్రం తప్పకుండా హిట్ కొడుతుందని అంతా భావించారు. మాస్ కంటెంట్ .. హిట్ ఫార్ములా కూడిన కథ కావడంతో నో డౌట్ అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే నభా ‘మాస్ట్రో’ సినిమా చేసింది. ‘అంధదూన్’కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా, ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత  ఆమె ఎంచుకున్న ఈ  కథలు ఆమెకి హిట్ తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో అవకాశాలు కూడా  అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. దాంతో అమ్మడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. మరో వైపున కృతి శెట్టి ..  శ్రీలీల .. కేతిక శర్మ వంటి కుర్ర బ్యూటీలు రంగంలోకి దిగేసి, ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను సవాల్ విసురుతున్నారు. మరి వీళ్ల ధాటిని .. ఘాటును నభా ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందనేది చూడాలి

Also Read :  అందాల నభా …ఆ ముగ్గురినీ తట్టుకోవడం కష్టమే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్