Sunday, January 19, 2025
HomeసినిమాProject K: నాగ్ అశ్విన్ ప్లాన్ అదిరింది

Project K: నాగ్ అశ్విన్ ప్లాన్ అదిరింది

ప్రభాస్, నాగ్ అశ్విన్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఓ గైడ్ లా వర్క్ చేస్తుండడం విశేషం.

అయితే.. ప్రాజెక్ట్ కే అనే టైటిల్ అనౌన్స్ చేశారు కానీ.. ప్రాజెక్ట్ కే అంటే ఏంటనేది మాత్రం చెప్పలేదు. ప్రాజెక్ట్-కే లో కే అంటే కృష్ణుడు లేదా కర్ణ అయి ఉండొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. నాగ్ అశ్విన్ పౌరాణిక పాత్రలతో ఎనిమిది సిరీస్ లు తీయాలనుకుంటున్నారట. ఈ ఎనిమిది సినిమాలను వేర్వేరు హీరోలతో తెరకెక్కించా ప్లాన్ వేశాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ తో అనుసంధానించి తెర పై ఆవిష్కరిస్తాడట.

ఈ ఎనిమిది సిరీస్ లలో ఎవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న ఈ మూవీపై  భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా సినిమా పై అంచనాలు పెంచాయి.

Also Read :  ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వ‌నీద‌త్

RELATED ARTICLES

Most Popular

న్యూస్