Tuesday, September 17, 2024
Homeసినిమామ‌రోసారి ఆలోచ‌న‌లోప‌డ్డ చైత‌న్య‌.?

మ‌రోసారి ఆలోచ‌న‌లోప‌డ్డ చైత‌న్య‌.?

మ‌జిలీ, వెంకీమామ, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు… ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ‌చైత‌న్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చ‌డ్డా సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ్ మూవీ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్ పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాకి ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా క‌లిసి సంగీతం అందిస్తుండడం విశేషం.

అయితే.. నాగ‌చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఇక సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే… ప‌ర‌శురామ్ కి మ‌హేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ప‌క్క‌న‌పెట్టి స‌ర్కారు వారి పాట సినిమా చేశాడు. ఈ సినిమా స‌క్సెస్ అయ్యింది కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌లేదు. ఇక నాగ‌చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. థ్యాంక్యూ, లాల్ సింగ్ చ‌డ్డా సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఎలాంటి సినిమాలు చేయాల‌నే విష‌యంలో టెన్ష‌న్ ఫీల‌వుతున్నాడ‌ట‌.

ప‌ర‌శురామ్ తో సినిమాని చేయాలా..?  వ‌ద్దా..? అనేది ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడ‌ట‌. ఇటీవ‌ల ప‌ర‌శురామ్ క‌థ చెప్పాడ‌ట‌. అయితే.. చైత‌న్య కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడ‌ట‌. ఆత‌ర్వాత ప‌ర‌శురామ్ మార్పులు చేర్పులు చేసిన‌ప్ప‌టికీ చైత‌న్య‌కి న‌చ్చ‌లేద‌ట. ప‌ర‌శురామ్ మ‌రో వర్షన్ రెడీ చేస్తున్నాడ‌ని స‌మాచారం. వెంక‌ట్ ప్ర‌భు మూవీ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు వేరే సినిమా గురించి ఆలోచించ‌కూడ‌దు అనుకుంటున్నాడ‌ట‌. మ‌రి.. ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్