నాగ‌చైత‌న్య ప్ర‌యోగం ఫ‌లిస్తుందా..?

Experiment:  యువ స‌మ్రాట్ నాగచైతన్య మ‌జిలీ, వెంకీమామ‌, బంగార్రాజు సినిమాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు సాధించి కెరీర్ లో మాంచి జోష్ తో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ రాశీ ఖన్నా, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఓ వెబ్ సిరీస్ చేయ‌డానికి ఓకే చెప్పాడు. హ‌ర్ర‌ర్ క‌థాంశంతో రూపొందే ఈ సిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఓ వెబ్ సిరీస్‌కు మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ షేర్‌ చేశాడు నాగ చైతన్య. ఈ లుక్ లో నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నాడు. హ‌ర్ర‌ర్ సినిమాలు చూడ‌డానికి.. చేయ‌డానికి ఇష్టప‌డ‌ని నాగ‌చైత‌న్య ఈ వెబ్ సిరీస్ లో న‌టించ‌డం.. ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌డం ఓ ప్ర‌యోగ‌మే. మ‌రి.. ఈ ప్ర‌యోగం ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *