Sunday, January 19, 2025
Homeసినిమామా విడాకులు.. మంచి నిర్ణ‌యం : నాగ‌చైత‌న్య‌

మా విడాకులు.. మంచి నిర్ణ‌యం : నాగ‌చైత‌న్య‌

Naga Chaitanya Divorces :

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌.. వీరిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంట విడిపోవ‌డం ఏంటి..?  చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. కొంత మంది అయితే…. ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నారు. విడాకులు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత యాడ్స్, సినిమాల్లో బిజీ అయ్యింది.

ఇక నాగ‌చైత‌న్య కూడా అంతే… సినిమాల్లో బిజీ అయ్యాడు. బంగార్రాజు సినిమా పూర్తి చేశాడు. అలాగే థ్యాంక్యూ అనే మూవీ కూడా పూర్తి చేశాడు. అయితే… తండ్రి నాగార్జున‌తో క‌లిసి న‌టించిన బంగార్రాజు చిత్రం ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా ముందుకు వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌కు విడాకుల గురించి ప్ర‌శ్న ఎదురైంది.

ఇద్దరికీ మంచే జరిగింది. మేమున్న పరిస్థితుల్లో విడిపోవడమే కరెక్ట్ అనుకున్నాం. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. ఆమె ఆనందంగానే ఉంది. నేనూ హ్యాపీగా ఉన్నాను. ఇంతకు మించి ఏమి లేదు అని తేల్చేశాడు నాగ చైతన్య. కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా లేనప్పుడు విడిపోవడమే బెటర్ కదా అన్నట్లుగా నాగ చైతన్య మాట్లాడాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్