Sunday, January 19, 2025
Homeసినిమాచైత‌న్య‌, ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ మ‌ల్టీస్టార‌ర్? మ‌రో హీరో ఎవ‌రు?

చైత‌న్య‌, ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ మ‌ల్టీస్టార‌ర్? మ‌రో హీరో ఎవ‌రు?

Multi Starrer:  యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ‘. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. జోష్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో దిల్ రాజు నిర్మించిన చిత్ర‌మిది. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్లేచింది… చివరకు ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని అనౌన్స్ చేశారు కూడా,  సెట్స్ పైకి  వెళ్ళే సమయంలో  మ‌హేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావ‌డంతో ఈ సినిమా ప‌క్క‌న‌పెట్టి ‘స‌ర్కారు వారి పాట’ చేశాడు పరశురామ్. ప్రస్తుతం నాగ చైత‌న్య రెండు ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పాడు. ఇవి పూర్తయిన తరువాత ప‌ర‌శురామ్ మూవీ మొదలవుతుంది.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏంటంటే… ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరో నవీన్ పోలిశెట్టి అయితే త‌ను అకున్న పాత్రలో బాగుంటాడని పరుశురామ్ ఫీల్ అవుతున్నాడట. ప్రస్తుతం పరశురామ్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. మ‌రి.. ఇదే క‌నుక నిజ‌మైతే ఈ ప్రాజెక్ట్ పై మ‌రింత ఇంట్ర‌స్ట్ క్రియేట్ అవ్వ‌డం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్