Sunday, January 19, 2025
Homeసినిమాచైతన్య చేతుల మీదుగా 'వెయ్ దరువెయ్' సాంగ్ రిలీజ్

చైతన్య చేతుల మీదుగా ‘వెయ్ దరువెయ్’ సాంగ్ రిలీజ్

సాయిరామ్ శంకర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెయ్ దరువెయ్‘. ఈ చిత్రానికి నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా దేవరాజు పొత్తూరు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీలోని సాంగ్ ను హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు.

నాగ చైతన్య మాట్లాడుతూ “ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సినిమా చూడాలన్న కూతూహలాన్ని రేపుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది” అన్నారు.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “నాగచైతన్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్. మొదటి సాంగ్ మంజుల మంజుల సాంగ్ అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది. చాల మంచి స్పందన వచ్చింది. రెండవ సాంగ్ టైటిల్ సాంగ్. ఇది మా మూవీ నుంచి మా సినిమాకి బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్. మీకు తప్పకుండా నచ్చుతుంది. మా ప్రొడ్యూసర్ గారికి , ఈ సాంగ్ రిలీజ్ చేసిన చైతన్య గారికి థాంక్స్ చెబుతున్నాను” అన్నారు.

దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ  “ఈ పాట విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు. ఈ సినిమా కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నారు. మా హీరో సాయి గారు , ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి థాంక్స్” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్