Sunday, January 19, 2025
Homeసినిమాఆగస్టులో చైతు వెర్సెస్ సామ్

ఆగస్టులో చైతు వెర్సెస్ సామ్

Chaitu-Sam: అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన ప్రేమ‌క‌థా చిత్రం ‘ఏమాయ చేసావే’. ఈ సినిమా టైమ్ లో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌డం.. ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోవ‌డం.. ఇటీవ‌ల విడిపోవ‌డం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఎవ‌రు సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. నాగ‌చైత‌న్య లాల్ సింగ్ చ‌ద్దా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టిస్తుండ‌డం విశేషం. ఇది నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ. దీంతో ఈ సినిమా పై టాలీవుడ్ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రాన్నిఆగ‌ష్టు 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. స‌మంత న‌టిస్తోన్న తాజా చిత్రం య‌శోద‌. జంట దర్శకులు హరి – హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ ను విడుదల చేశారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ హిందీ భాష‌ల్లో ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌నున్నారు.

ఆగ‌ష్టు 11న నాగ‌చైత‌న్య లాల్ సింగ్ చ‌ద్దా రిలీజ్ అయితే… ఆగ‌ష్టు 12న స‌మంత య‌శోద రిలీజ్ కానుంది. ఇలా ఒక రోజు గ్యాప్ లో వీరిద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డుతుండ‌డం విశేషం. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా స‌క్సెస్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్