Saturday, January 18, 2025
Homeసినిమాచైత‌న్య వెబ్ సిరీస్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

చైత‌న్య వెబ్ సిరీస్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Dootha: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య హాకీ ప్లేయ‌ర్ గా న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. స‌రైన డేట్ సెట్ కాక‌పోవ‌డంతో రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.

ప్ర‌స్తుతం భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. స‌మ్మ‌ర్ త‌ర్వాత థ్యాంక్యూ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాగ‌చైత‌న్య ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పారు. ఈ వెబ్ సిరీస్ కు కూడా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమారే. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. దీనికి దూత అనే టైటిల్ ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లో ఈ వెబ్ సిరీస్ టైటిల్ అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌నున్నారు.

తాజా వార్త ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్ ను ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ సిరీస్ లో నాగ‌చైత‌న్య పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు పాత్ర‌లు పోషించ‌డం విశేషం. మ‌రి.. ఈ హ‌ర్ర‌ర్ వెబ్ సిరీస్ తో నాగ‌చైత‌న్య ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : నాగ‌చైత‌న్య స‌రికొత్త రికార్డ్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్