Sunday, February 23, 2025
Homeసినిమానాగశౌర్యకి ఇది పరీక్షా సమయమే!

నాగశౌర్యకి ఇది పరీక్షా సమయమే!

టాలీవుడ్ లో మంచి ఒడ్డూ పొడుగు ఉన్న హీరోల్లో నాగశౌర్య ఒకరు. కెరియర్ ఆరంభంలోనే హ్యాండ్సమ్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. యూత్ లో నాగశౌర్యకి మంచి ఫాలోయింగ్ ఉంది. నిజం చెప్పాలంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో ముందు వరుసలో కనిపిస్తాడు. కటౌట్ పరంగా చూసినా .. కంటెంట్ పరంగా చూసినా హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడిగానే నాగశౌర్య కనిపిస్తాడు.

అయితే లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఆయన యాక్షన్ హీరోగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. కారణం ఏదైనా యాక్షన్ హీరోగా ఆయనకి సక్సెస్ మాత్రం దక్కలేదు. మళ్లీ తనకి కాస్త పట్టు ఉన్న లవ్ స్టోరీస్ .. ఫ్యామిలీ సినిమాలు చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదు.  ‘వరుడు కావలెను’ వంటి సినిమా కూడా ఆడియన్స్ కి అంతగా సంతృప్తి కలిగించకపోవడం ఆయనను డీలాపడేలా చేసింది.

ఈ నేపథ్యంలోనే నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’ చేశాడు. యూత్ కీ .. ఫ్యామిలీ  ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం నాగశౌర్యకి చాలా ఉంది. అటు చేసి .. ఇటు చేసి పరీక్షల సమయంలో ఈ సినిమా విడుదలవుతోంది. నాగశౌర్యకి కూడా ఇది ఒక రకంగా పరీక్షా సమయమే. ఈ సినిమాతోనైనా మళ్లీ ఈ అందగాడు గాడిలో పడతాడేమో చూడాలి.

Also Read : ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ విజయం సాధించేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్