Friday, February 28, 2025
Homeసినిమానాగశౌర్య 'రంగబలి' .. ట్రైలర్ రిలీజ్!

నాగశౌర్య ‘రంగబలి’ .. ట్రైలర్ రిలీజ్!

నాగశౌర్య నటించిన అవుట్-అండ్-అవుట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది.సీహెచ్ పవన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదులుతూ వచ్చిన పోస్టర్స్ వలన .. టీజర్ వలన మరింత ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ . యాక్షన్ .. కామెడీతో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలన్ గా షైన్ టామ్ చాకో మార్క్ చూపించారు.శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, గోపరాజు రమణ, సత్య, అనంత శ్రీరామ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జులై 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా అయినా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్