నాగార్జున తన అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. విజయ్ బిన్ని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈరోజు నాగార్జున పుట్టిన రోజు 64వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేశారు.ఈ మూవీకి ‘నా సామిరంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గ్లింప్స్ చూస్తే పూర్తి మాస్ మూవీలా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. 2024 సంక్రాంతికి వస్తున్నాం.. మాస్ జాతర మొదలు అని మేకర్స్ ప్రకటించారు.
కాగా, ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధింని నటీనటులతో పాటు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.