Sunday, January 19, 2025
HomeసినిమాNagarjuna: కింగ్ నాగార్జునకు ఏమైంది..?

Nagarjuna: కింగ్ నాగార్జునకు ఏమైంది..?

నాగార్జున ఇద్దరు కొడుకుల్లో చైతన్య మాస్ హీరో అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ.. మాస్ ప్రయత్నం ఫలించడం లేదు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలతో సక్సెస్ సాధించి మిడ్ రేంజ్ హీరోగా కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం ‘కస్టడీ’ అంటూ మరోసారి మాస్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే.. అఖిల్ మాత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాతో సక్సెస్ సాధించాడు కానీ.. స్టార్ ఇమేజ్ కోసం బ్లాక్ బస్టర్ సాధించాలని ‘ఏజెంట్’ చేశాడు. ఈ నెల 28న ఏజెంట్ వస్తుంది.

ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ మూవీకి భారీగా క్రేజ్ వచ్చింది. ఇండస్ట్రీ జనాలు స్పందించారు కానీ.. నాగార్జున మాత్రం సైలెంట్ గానే ఉన్నారు కానీ.. ఏజెంట్ మూవీకి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అఖిల్ సినిమాల విషయంలో చాలా స్పీడుగా రియాక్ట్ అయ్యే నాగార్జున ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఆసక్తిగా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ విషయంలో కూడా రిలీజ్ కు ముందు సైలెంట్ గానే ఉన్నారు. రిలీజ్ తర్వాత సక్సెస్ అయ్యాకా అందరికీ పార్టీ ఇచ్చారు. కొడుకు సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇప్పుడు కూడా ఏజెంట్ రిలీజై సక్సెస్ అయిన తర్వాత స్పందించాలని ఫిక్స్ అయ్యారా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ.. నాగార్జున గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. నాగ్ ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకుంటారు. ఇంకా చేయి పట్టుకుని నడిపించాలి అనుకోరు. వాళ్లకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి… రాంగ్ డిసిషన్స్ తీసుకుంటే దాని వలన కూడా నేర్చుకుంటారు మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటారని నాగ్ అంటుంటారు. అందుకే ఇలా చేస్తున్నారేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్