Sunday, January 19, 2025
Homeసినిమానాగ్ నెక్ట్స్ మూవీ రీమేకా..? స్ట్రైయిట్ మూవీనా..?

నాగ్ నెక్ట్స్ మూవీ రీమేకా..? స్ట్రైయిట్ మూవీనా..?

నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగ్ సరికొత్త యాక్షన్ సీన్స్ లో నటించారు. టేకింగ్ అంతా కొత్తగా ఉంది కానీ.. కథ పాతదే అనే ఫీలింగ్ కలగడంతో ది ఘోస్ట్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే.. అంతకు ముందు నాగార్జున చేసిన యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఈసారి యాక్షన్ మూవీ కాదు.. ఎంటర్ టైన్మెంట్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు నాగ్.

రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్షన్ లో నాగార్జున ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఏంటంటే.. ఇది రీమేక్ మూవీ అని ఆ వార్త సారాంశం. అప్పటి నుంచి నాగార్జున, బెజవాడ ప్రసన్నకుమార్ కాంబోలో వచ్చేది రీమేకా..? స్ట్రైయిట్ మూవీనా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే… మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన ఎంచుకునే కథల్లో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. అలాంటి జోజు జార్జ్ చేసిన ‘పోరింజు మరియం జోస్’ అనే సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఆ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రీమేక్ చేయడానికే నాగ్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. మరి.. ఈ రీమేక్ తో నాగ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్