వీరసింహారెడ్డి వీరమాస్ సెలబ్రేషన్స్ లో.. నటసింహం నందమూరి బాలకృష్ణ “అక్కినేని తొక్కినేని” అనడం వివాదస్పదం అయ్యింది. ఇది అక్కినేని కుటుంబ సభ్యులను, అభిమానులను బాధించింది. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు.. తెలుగు కళామాతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకున్నట్లే అని నాగచైతన్య ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అలాగే అఖిల్ కూడా ఇదే పోస్ట్ పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఇక అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు బాలయ్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే.. అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. అభిమానులు స్పందించారు కానీ.. నాగార్జున స్పందించకపోవడం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. బాలయ్యతో కలిసి సుమంత్ కథానాయకుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించాడు. బహుశా అందుకే ఈ విషయం పై రియాక్ట్ అవ్వడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో, మీడియాలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదస్పం అవ్వడంతో ఈ వివాదం ఎటు వైపు వెళుతుంది అనేది ఆసక్తిగా మారింది.
అక్కినేని కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు ఎస్వీ రంగారావును కామెంట్ చేయడంతో కాపు నాయకులు కూడా బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు సినీవర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్ అయ్యింది. నాగార్జున మౌనంగా ఉండడం వెనుక వ్యూహం ఉందా..? దీనిని ఇంతటితో వదిలేస్తారా.? బాలయ్య క్షమాపణలు చెబుతారా..? ఏం జరగనుంది అనేది చర్చనీయాంశం అయ్యింది.
Also Read : మనల్ని మనమే కించపరచుకోవటం: నాగ చైతన్య, అఖిల్